Friday, 3 July 2020

ఆయన స్టైలే వేరు.. ఆయనకి సాటిరారు ఎవరూ..

                     
                         ప్రస్తుత రాజకీయాలలో ఎక్కడ  ప్రత్యర్థులు తమకు  చిక్కితే  ఎలా  విమర్శలు చేయాలనే  ఆలోచనే తప్ప  ప్రత్యర్థులు  మంచి పని చేస్తే  వాళ్ళని అభినదించే సందర్భాలు చాల తక్కువనే  చెప్పాలి అయితే  పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గారిది రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని  ప్రశ్నించడం, మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన  వారిని అభినదించడం  ఆయన నైజం. అందుకేనేమో పవన్ కళ్యాణ్ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ,ఆయన అభిమానులు అంతగా ఆయనను అభిమానిస్తూవుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేసిన ట్వీట్లు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి..





                 ఆయన ఏం ట్వీట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అత్యవసర సేవలన్నీ అందించే అంబులెన్సులిని, అత్యవసర పరిస్థితుల్లో ఆరభించడం అభినందనీయమని, అలాగే గత మూడు నెలలుగా  కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తున్న తీరు అభినందనీయం అని ట్వీట్ చేశారు. గతంలో కూడా కరోనా కారణంగా  టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు..

               ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన వారిని అభినదించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని తీసుకొనివస్తున్నారనే చెప్పాలి..

మహేష్ బాబు కొత్త రికార్డ్..

మన సినిమా ఇండస్ట్రీలో  హీరోలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నేడు కరోనా నేపధ్యంలో హీరోలు తమ అభిమానులను మరింత దగ్గరగా ఉంచింది కేవలం ఒక్క సోషల్ మీడియా మాత్రమే. మామూలు రోజుల్లో సోషల్ మీడియా వైపు చూడని హీరోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసుకుని  హీరోలు సోషల్ మీడియా వేదికలపై తమ మనోభావాలు, తమ వ్యక్తిగత జీవితాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వారు నిజ జీవితంలో ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారు, వారి కుటుంబ సబ్యులతో ఎలా గడుపుతారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.




     
         ఇప్పుడు అసలు  విషయంలోకి వెళ్తే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకి మన తెలుగు రాష్ట్రలలోనే కాదు సౌత్ ఇండియాలోను మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలలోనే కాకుండా  సోషల్ మీడియా వేదికలపై కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తాజాగా ట్విట్టర్ లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఏకంగా సౌత్ ఇండియాలోనే  కోటి మంది ట్విట్టర్  ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి  సౌత్ ఇండియా స్టార్ హీరోగా రికార్డును నమోదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విటర్ వేదికగా తన అభిమానులకు, ట్విటర్ ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

Friday, 5 June 2020

ఈ 3 స్టెప్స్ తో మీ పెదవులు లేత గులాభి రంగులో మారతాయి | how to get pink l...





పెదవులు లేత గులాబీ రంగులో వుండాలని అందరూ కోరుకుంటారు కానీ చాలామంది పెదవులు రకరకాల కారణాలవల్ల నలుపురంగు లోకి మారుతూ వుంటాయి. మరియు కొంతమంది పెదవులు ముందు నుంచే కొంచెం రంగు తక్కువగా ఉంటాయి అలాంటి వారికోసం ఇంట్లోనే ఉండి పెదవుల రంగు మార్చే అధ్భూతమైన ఇంటి రెమెడీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. జస్ట్ మనం రోజూ ఆ 3 స్టెప్స్ ఫాలో అయితేచాలు. ఈ చిట్కా పెదవులు రంగు మారడానికే కాదు పెదవులను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.