మన సినిమా ఇండస్ట్రీలో హీరోలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నేడు కరోనా నేపధ్యంలో హీరోలు తమ అభిమానులను మరింత దగ్గరగా ఉంచింది కేవలం ఒక్క సోషల్ మీడియా మాత్రమే. మామూలు రోజుల్లో సోషల్ మీడియా వైపు చూడని హీరోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసుకుని హీరోలు సోషల్ మీడియా వేదికలపై తమ మనోభావాలు, తమ వ్యక్తిగత జీవితాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వారు నిజ జీవితంలో ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారు, వారి కుటుంబ సబ్యులతో ఎలా గడుపుతారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.
ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకి మన తెలుగు రాష్ట్రలలోనే కాదు సౌత్ ఇండియాలోను మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా వేదికలపై కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తాజాగా ట్విట్టర్ లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఏకంగా సౌత్ ఇండియాలోనే కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి సౌత్ ఇండియా స్టార్ హీరోగా రికార్డును నమోదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విటర్ వేదికగా తన అభిమానులకు, ట్విటర్ ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment