Friday, 3 July 2020

ఆయన స్టైలే వేరు.. ఆయనకి సాటిరారు ఎవరూ..

                     
                         ప్రస్తుత రాజకీయాలలో ఎక్కడ  ప్రత్యర్థులు తమకు  చిక్కితే  ఎలా  విమర్శలు చేయాలనే  ఆలోచనే తప్ప  ప్రత్యర్థులు  మంచి పని చేస్తే  వాళ్ళని అభినదించే సందర్భాలు చాల తక్కువనే  చెప్పాలి అయితే  పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గారిది రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని  ప్రశ్నించడం, మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన  వారిని అభినదించడం  ఆయన నైజం. అందుకేనేమో పవన్ కళ్యాణ్ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ,ఆయన అభిమానులు అంతగా ఆయనను అభిమానిస్తూవుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేసిన ట్వీట్లు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి..





                 ఆయన ఏం ట్వీట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అత్యవసర సేవలన్నీ అందించే అంబులెన్సులిని, అత్యవసర పరిస్థితుల్లో ఆరభించడం అభినందనీయమని, అలాగే గత మూడు నెలలుగా  కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తున్న తీరు అభినందనీయం అని ట్వీట్ చేశారు. గతంలో కూడా కరోనా కారణంగా  టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు..

               ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన వారిని అభినదించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని తీసుకొనివస్తున్నారనే చెప్పాలి..

No comments:

Post a Comment